శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానం మాడవీధులలో భక్తుల సౌకర్యార్థం కూలింగ్ పెయింట్
మండలంలోని సురుటపల్లి గ్రామంలో వెలసియుండు శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానంకు ప్రతిరోజు స్వామి అమ్మవార్ల దర్శనం కొరకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేయుచున్నారు. అయితే వేసవికాలం వలన ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో భక్తులు పార్కింగ్ స్థలం నుంచి గోపురం వద్దకు విచ్చేయ సమయంలో అలాగే దర్శనం అయిన తదుపరి అన్నదానం భవనంకు మాడ వీధుల మీదుగా వెళ్ళు సమయంలో కాళ్లు కాలుతూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది గమనించిన ఆలయ చైర్మన్ డి. పద్మనాభ రాజు కార్యనిర్వహణాధికారిణి పి. లత, పాలకమండలి సభ్యులు...