GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 24 May 2026, 4:26 pm Posted by : GARUDA DHATRI NEWS

శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతరకు శంకర్ రెడ్డికి ఆహ్వానం

శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతరకు శంకర్ రెడ్డికి ఆహ్వానం

గరుడధాత్రి :
సత్యవేడు మండలం కొత్తమారికుప్పం గ్రామంలో మే 28న నిర్వహించనున్న పోలేరమ్మ గంగ జాతరకు టిడిపి నియోజకవర్గ పోగ్రామ్ కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డిని పలువురు గ్రామస్తులు ఆహ్వానించారు.
ఆదివారం తిరుపతిలోని శంకర్ రెడ్డి స్వగృహంలో గ్రామస్తులు హరిరెడ్డి, ప్రతాప్ రెడ్డి, శ్రీరాములు రెడ్డి, మోహన్ బాబు రెడ్డి,శ్యాంప్రసాద్ రెడ్డి,అమాస్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి,చెల్లయ్య తదితరులు ఆయన్ను కలిసి సాలువా కప్పి పండ్లు,పుష్పాలతో ఆహ్వాన పత్రికను అందించారు.పోలేరమ్మ గంగ జాతరకు తప్పనిసరిగా రావాల్సిందిగా ఈ సందర్భంగా గ్రామస్తులు శంకర్ రెడ్డిని కోరగా సానుకూలంగా స్పందించినట్లు గ్రామస్తులు చెప్పారు.