శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు
జూన్ 25 నుంచి జూలై 3 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవ వైభవానికి ముస్తాబవుతున్న అప్పలాయగుంట భక్తులందరికీ మరపురాని ఆధ్యాత్మిక అనుభూతి కల్పించాలి – జేఈవో డా. ఎ. శరత్ అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను జూన్ 25 నుండి జూలై 3 వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆలయ పరిసరాలు, బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆలయ...