శ్రీ ప్రియా నర్సింగ్ హోమ్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు
కుప్పం,సెప్టెంబర్ 14 (గరుడ ధాత్రి న్యూస్): కుప్పంలో పేరు గడించిన శ్రీ ప్రియా నర్సింగ్ హోమ్ లో వినాయక చవితి పండుగను ఘనంగా నిర్వహించారు. సోమవారం వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ప్రియా నర్సింగ్ హోమ్ లో వైభవంగా అత్యంత భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అందరికీ ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ ప్రియా నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ డి. సుధీర్, శ్రీమతి ప్రియా సుధీర్, డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.