బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు16
రాష్ట్ర వైకాపా కార్యదర్శులు మొగశాల సోదరులు ఆదివారం మర్రిమానుచేను గ్రామంలో శ్రీ మరెమ్మ తల్లి ఆలయం సందర్శించడం జరిగింది.ఈ సందర్భంగా వారికి గ్రామస్థులు వారికి ఘనస్వాగతం పలికారు. మొగశాల సోదరులు కృష్ణమూర్తి, రెడెప్ప లు అమ్మవారికి పూజలు చేపట్టి మండలంలో సకాలంలో వర్షాలు కురిసే రైతులకు మంచి పంటలు చేకూరి అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్ధించడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.