GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 26 July 2026, 4:14 pm Posted by : GURU SWAMY

శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆడికృత్తిక ఉత్సవ ఆహ్వాన కరపత్రాలు ఆవిష్కరణ

రామకుప్పం జూలై 26 గరుడ దాత్రి న్యూస్

రామకుప్పం మండలం కంచన బల్ల పంచాయతీకి చెందిన పాలరేవుగడ్డ నందు వెలసిన ప్రముఖ శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యస్వామి ఆడి మరియు కృత్తిక ఉత్సవ ఆహ్వాన కరపత్రాలను ఆదివారం ఆలయం వద్ద అర్చకులు ఆవిష్కరించారు ఆగస్టు మూడవ తేదీ నుండి ప్రారంభమయ్యే ఆడీ కృత్తిక ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు 3 మరియు ఆరవ తేదీన నందు ప్రత్యేక కావడి ఉత్సవాలు చెల్లింపు భజనలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు పాలు రేవు గడ్డ సమీపంలోని సుమారు 20 గ్రామాలకు చెందిన గ్రామస్తులు ఈ ఆలయం నందు విశిష్ట పూజలను వివిధ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని పేర్కొన్నారు కరపత్రాలు ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ మునుస్వామి ప్రముఖ హరికథ కళాకారుడు గిరిదాస్ అర్చకులు తదితరులు పాల్గొన్నారు