GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 02 July 2026, 6:53 am Posted by : GURU SWAMY

శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంలో పరకామణి

-రూ.6.37 లక్షల ఆదాయం

నాగలాపురం గరుడధాత్రి న్యూస్ :
టిటిడి అనుబంధంలో ఉన్న శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంలో బుధవారం సూపరింటెండెంట్ ధర్మయ్య ఆధ్వర్యంలో పరకామణి నిర్వహించారు. ఆలయ హుండీలలో భక్తులు సమర్పించిన నగదు కానుకలను అధికారులు లెక్కించారు. గత మూడు నెలల వ్యవధిలో హుండీల ద్వారా మొత్తం రూ.6,37,700 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. పరకామణి కార్యక్రమాన్ని ఆలయ సిబ్బంది, భక్తుల సమక్షంలో పారదర్శకంగా నిర్వహించారు.