GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 27 April 2026, 7:43 pm Posted by : GARUDA DHATRI NEWS

శ్రీ వేదనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం

*శ్రీ వేదనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం*

*ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ను ఆహ్వానించిన టిటిడి అధికారులు*

నాగలాపురం శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మే నెల 1 నుండి 9వ తేదీ వరకు జరగనుంది.

ఈ క్రమంలో టెంపుల్ ఇన్స్ పెక్టర్ చెంగల్రాయులు, ఆలయ ప్రధాన అర్చకులు నాగరాజ భట్టాచార్య, అర్చక బృందంతో కలిసి ఎమ్మెల్యే స్వగృహానికి చేరుకొని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కు నాగలాపురం బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ఆహ్వాన పత్రిక అందించి, సగౌరవంగా ఆహ్వానం పలికారు.

అనంతరం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తో పాటు అతని కుటుంబ సభ్యులను అర్చక స్వాముల బృందం ఆశీర్వచనాలు పలికింది.