GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 7:18 am Digital Edition : GURU SWAMY

శ్రీ శంకరంబాడి సుందరాచారి సేవలు చిరస్మరణీయం

కార్వేటినగరం ఆగస్టు 10 గరుడదాద్రి న్యూస్ కార్వేటినగరం సంస్థానంను పరిపాలించిన జమీందారులు రాజా కుమారస్వామి రాజా వారి కవిత విద్యను గుర్తించి బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా 1944-47 కాలంలో నియమించడం జరిగింది. ఆ కాలంలోనే రాష్ట్రజ్ఞ్యతంగా ఉన్న మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే గేయాన్ని ఇక్కడే రచించడం జరిగిందని శంకరంబాడి సుందరాచార్యులు జయంతి సందర్భంగా వ్యక్తులు పేర్కొన్నారు. ఆయన చిత్రపటానికి పూల మానేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మర్రి శేఖర్, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు విజయకుమార్ పిళ్ళై , ఉపాధ్యాయులు రవి, సరిత, వేణుగోపాల్, సుప్రసన్న, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.