శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవాలయంలో వైభవంగా శాకంబరీ అలంకరణ
పలమనేరు, ఆగస్టు 09 (గరుడ ధాత్రి): పలమనేరు పాతపేటలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానంలో ఆషాడ మాస కామిక ఏకాదశిని పురస్కరించుకుని పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. విష్ణుమూర్తికి, అమ్మవార్లకు ఎంతో ప్రీతిపాత్రమైన ఈ పవిత్ర దినాన స్వామివారిని దర్శించుకుని పూజలు చేస్తే సూర్యలోక ప్రాప్తి సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. కామిక ఏకాదశి సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయంలో స్వామివారికి శాకంబరీ ఉత్సవాన్ని నిర్వహించారు. మహిళా భక్తులు భక్తిశ్రద్ధలతో వివిధ రకాల పచ్చి కూరగాయలతో సుందరమైన మాలలను తయారు...