షమీర్‌బాషా పెళ్లికి హాజరు అయి వధూవరులను ఆశీర్వదించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్4 బైరెడ్డిపల్లి మండల కేంద్రంలోని జామియా మసీదులో ఆదివారం జరిగిన నికాహ్‌ కార్యక్రమానికి పుంగనూరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం హాజరై వధూవరులను ఆశీర్వదించారు. బైరెడ్డిపల్లి మండలం మేకలనాగిరెడ్డిపల్లికి చెందిన జి. షమ్షీర్‌ బాషా తో అన్నమయ్య జిల్లా సోమల మండలం వంగసానివారిపల్లికి చెందిన నూర్‌-ఇ-చేష్మి నికాహ్‌ ఆదివారం ఉదయం జామియా మసీదులో జరిగింది. అనంతరం బైరెడ్డిపల్లి రాయల్‌ మహల్‌లో ఏర్పాటు చేసిన విందులో పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బైరెడ్డిపల్లి మండల వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి...