GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 02 June 2026, 6:46 am Posted by : GARUDA DHATRI NEWS

షర్మిలకు రాజ్యసభ సీటు.. ప్రకటించిన ఖర్గే

గరుడధాత్రి :
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు రాజ్యసభ సీటు కేటాయిస్తున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ప్రకటన విడుదల చేశారు. కర్ణాటక నుంచి షర్మిలకు రాజ్యసభకు పంపుతున్నట్లు వెల్లడించారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలోనే ఆమెకు రాజ్యసభ సీటు ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చింది.