సత్యవేడులో ఇద్దరిచే అన్నా క్యాంటీన్ ప్రారంభం..!
- అల్పాహారం ఒకరు.. మధ్యాహ్న భోజనం మరొకరు..! సత్యవేడు, జూన్ 3 గరుడధాత్రి : నియోజకవర్గ కేంద్రమైన సత్యవేడులో ప్రారంభమైన అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం ఆసక్తికర పరిణామాలకు వేదికగా నిలిచింది. ప్రోటోకాల్ ప్రకారం సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించి, ఉదయం అల్పాహార పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం అధికారులు తమ కార్యాలయాలకు వెళ్లిపోయారు. అయితే కొద్దిసేపటికే టీడీపీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి అన్నా క్యాంటీన్‌కు...