సత్యవేడులో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
సత్యవేడు ఆగస్టు 15 గరుడధాత్రి సత్యవేడు మండల వ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, రాజకీయ పార్టీల కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగురవేసి మువ్వన్నెల రెపరెపల నడుమ సంబరాలు జరుపుకున్నారు.స్థానిక జూనియర్ సివిల్ జడ్జి మరియు జుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ప్రాంగణంలో జడ్జి ఏ. వెంకట నాగరాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. న్యాయవాదులతో కలిసి వేడుకలను ఘనంగా నిర్వహించిన అనంతరం కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ శివప్రసాద్, సాయినాథ్...