సత్యవేడులో జాతర చాటింపు సందడి

*సత్యవేడులో జాతర చాటింపు సందడి* తిరుపతి జిల్లా సత్యవేడులో సదవాలమ్మ గంగ జాతర తొలి చాటింపు వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వేపాకు తోరణాలు, అంబళ్లు, మొక్కులు, పొంగళ్ల నైవేద్యాలతో పట్టణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఉదయం గంగమిట్ట వద్ద ప్రత్యేక కలశాన్ని ఏర్పాటు చేసి, వేప తోరణాలు కట్టి మహిళలు తీసుకొచ్చిన అంబళ్లను అక్కడ ఉంచిన పాత్రలో పోసి మొక్కులు చెల్లించారు. అనంతరం సదవాలమ్మ ఆలయం వద్ద పొంగళ్లను సిద్ధం చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. తమ కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని, సత్యవేడు...