సత్యవేడులో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ ప్రవేశాలు ప్రారంభం

సత్యవేడు, ఆగస్టు 3 గరుడధాత్రి : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, ఏలూరు పరిధిలోని ఆంధ్రప్రదేశ్ అధ్యయన కేంద్రం (066) ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సత్యవేడులో 2026–27 విద్యా సంవత్సరానికి యూజీ డిగ్రీ కోర్సుల ప్రవేశాలు ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యు. నరసింహులు తెలిపారు. ఉద్యోగులు, గృహిణులు, చదువును మధ్యలో నిలిపివేసిన వారు, అలాగే ఉన్నత విద్యను కొనసాగించాలనుకునే వారికి సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా నాణ్యమైన విద్యను అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరంలో బి.ఏ. (రాజనీతి శాస్త్రం–సామాజిక శాస్త్రం–పబ్లిక్...