సత్యవేడులో మళ్ళీ మొదలైన హెవీ టన్నేజీ…!
ట్రాఫిక్‌కు అంతరాయంగా మారిన కంకర లారీల తాకిడి...! ఉదయం, సాయంత్రం వేళల్లో బజారుకు రావాలంటేనే భయాందోళన..! సత్యవేడు జూలై 28 గరుడధాత్రి : కొద్ది రోజుల విరామం అనంతరం మండలంలోని చమర్త కండ్రిగ నుంచి మళ్లీ భారీ టన్నేజీతో కంకర లారీల రాకపోకలు జోరందుకున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడుతో వెళ్తున్న లారీల కారణంగా రహదారులు దెబ్బతింటుండటమే కాకుండా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడో నిర్మించిన ఆర్ అండ్ బి రోడ్లు ఈ భారీ వాహనాల ఒత్తిడిని తట్టుకోలేక అక్కడక్కడా పగుళ్లు, గుంతలతో...