సత్యవేడులో సిపిఎంకు ఎదురుదెబ్బ -సీనియర్ నేత అరుణాచలం రాజీనామా..
సత్యవేడులో సిపిఎంకు ఎదురుదెబ్బ.. సీనియర్ నేత అరుణాచలం రాజీనామా.. -మరో నలుగురు కార్యకర్తలూ గుడ్‌బై సత్యవేడు ప్రాంతంలో సిపిఎం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ అనుబంధ సంఘమైన కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షుడు, సిపిఎం సీనియర్ నేత అరుణాచలం పార్టీకి రాజీనామా చేశారు. స్థానిక నాయకత్వం పార్టీ సిద్ధాంతాలు, భావజాలాలను విస్మరిస్తోందని ఆరోపిస్తూ తన రాజీనామాను ప్రకటించారు. పార్టీలో హోల్‌టైమర్లకే ప్రాధాన్యత ఇస్తూ, ఎన్నేళ్లుగా ఉద్యమాల్లో పనిచేసిన సీనియర్లను పూర్తిగా పక్కన పెడుతున్నారని అరుణాచలం ఆవేదన వ్యక్తం చేశారు....