సత్యవేడు అభివృద్ధి పనులపై జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

సత్యవేడు, ఆగస్టు 4 గరుడధాత్రి : సత్యవేడు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం జాయింట్ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. వినతిపత్రంలో పిచ్చాటూరు మండలం ఎస్‌ఎస్‌బీ పేటతో పాటు ఇతర గ్రామాల్లో నివసిస్తున్న సుమారు 400 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇంటి స్థల పట్టాలు మంజూరు చేయాలని కోరారు. అలాగే పిచ్చాటూరు మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న పర్యాటక టవర్ పనులను పూర్తి చేసేందుకు అవసరమైన తుడా నిధులను విడుదల చేయడంతో పాటు...