సత్యవేడు టీడీపీలో అంతర్గత పోరు..!
ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ చుట్టూ రాజకీయ వేడి.. !! అధిష్ఠానం నిర్ణయాలే ప్రామాణికమంటున్న ఓ వర్గం.. ! సత్యవేడు అక్టోబర్ 10 గరుడధాత్రి : సత్యవేడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో అంతర్గత రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్ కూరపాటి శంకర్‌రెడ్డి నాయకత్వం, పార్టీ క్రమశిక్షణ, స్థానిక నాయకుల మధ్య సమన్వయం వంటి అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనపై వస్తున్న విమర్శలకు మద్దతుదారుల నుంచి విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతుండటంతో పార్టీలో అసలేం జరుగుతోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. నియోజకవర్గంలో పార్టీ...