సత్యవేడు టీడీపీలో రాజుకుంటున్న అంతర్గత విభేదాలు
రెండేళ్ల అభివృద్ధి ప్రచారంలో వర్గ విభేదాల ప్రభావం? ఒకే గూటికి చేరతామన్న నేతల మధ్య ఆధిపత్య పోరు సత్యవేడు, ఆగస్టు 4 గరుడధాత్రి : సత్యవేడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “రెండేళ్ల అభివృద్ధి – సంక్షేమం” కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి కరపత్రాల పంపిణీ చేపట్టాలని పార్టీ అధిష్ఠానం సూచించినప్పటికీ, స్థానికంగా నాయకుల మధ్య సమన్వయం లోపించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీని ఏకతాటిపైకి తీసుకువస్తానని చెప్పిన నియోజకవర్గ కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి నాయకత్వంపై...