సత్యవేడు టీడీపీ పరిస్థితిపై అధిష్టానం ద్వంద్వ వైఖరి..?
-వర్గ విభేదాలు.. సమన్వయ లోపం.. ! -స్థానిక సంస్థల ఎన్నికల వేళ పార్టీ శ్రేణుల్లో అయోమయం..? సత్యవేడు సెప్టెంబర్ 13 గరుడధాత్రి : తమిళనాడు సరిహద్దులో ఉన్న సత్యవేడు రిజర్వు నియోజకవర్గం ఒకప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీకి బలమైన నియోజకవర్గాల్లో ఒకటిగా నిలిచిందని ఆ పార్టీ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. అయితే ప్రస్తుతం నియోజకవర్గంలో నెలకొన్న వర్గ విభేదాలు, నాయకుల మధ్య సమన్వయ లోపం, అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సత్యవేడు టికెట్‌ను ఆశించిన...