సత్యవేడు నియోజకవర్గంలో ఘనంగా వర్చువల్ మహానాడు

సత్యవేడు నియోజకవర్గంలో ఘనంగా వర్చువల్ మహానాడు గరుడధాత్రి న్యూస్ : తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడు కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా కోలాహలంగా ప్రారంభమైన నేపథ్యంలో సత్యవేడు నియోజకవర్గంలోని పలు మండలాల్లో మహానాడు వేడుకలను పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌చార్జిల ఆధ్వర్యంలో వర్చువల్ విధానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొని పార్టీ పట్ల తమ ఐక్యతను చాటిచెప్పారు. ఈ సందర్భంగా సత్యవేడు నియోజకవర్గ టిడిపి ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి, పరిశీలకులు...