GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 5:05 pm Digital Edition : GURU SWAMY

సత్యవేడు పోలీసు తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం

సత్యవేడు పోలీసు తీరుపై
ఎమ్మెల్యే ఆగ్రహం..

అంబేద్కర్ విగ్రహం సాక్షిగా… సత్యవేడు పోలీసుల తీరుపై స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతోత్సవాల్లో స్థానిక సీఐ, ఎస్ఐలు కనిపించకపోవడం, వారు ఇటీవల బాధ్యత తప్పి… ఇతరులకు కొమ్ముకాస్తున్నారని, పనికిమాలిన వారికి ప్రోటోకాల్ ఇచ్చి పబ్బం గడుపుకుంటున్నారని నిప్పులు కక్కారు కార్యక్రమానికి హాజరైన ఏఎస్ఐ, సిబ్బందిని ప్రశ్నలతో ముంచెత్తారు ఆదిమూలం ఆగ్రహాన్ని చూసి స్థానికులు, అంబేద్కర్ అభిమానులు, స్థానిక న్యాయవాదులు నివ్వెర పోయారు అంబేద్కర్ అంటే.. సీఐ కు ఏమాత్రం గౌరవం లేకపోగా… అదే బాటలో ఎస్ఐ కూడా ఉన్నారని అక్కడే ఉన్న స్థానికులు ఆదిమూలం దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది ఇదిలా ఉండగా సీఐ వ్యవహార శైలి, తాజాగా ఆయన చేస్తున్న కార్యకలాపాలు, ఆయా మండలాల్లో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో వంటి విషయాలపై రాష్ట్ర, జిల్లా పోలీస్ అధికారుల దృష్టికి లిఖితపూర్వకంగా తీసుకెళ్లనున్నట్లు ఎమ్మెల్యే ఆదిమూలం స్థానికులకు తెలియజేశారని సమాచారం