సత్యవేడు ఆగస్టు 15 గరుడధాత్రి :
సత్యవేడు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాధికారి వెంకటరత్నం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఆగస్టు 15న ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి వెంకటరత్నం జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. అందరి సహకారంతో ప్రభుత్వ ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేసి, నిరుపేదలకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉండేలా కృషి చేస్తామని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రి అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.