సత్యవేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా డాక్టర్ నరసింహులు బాధ్యతల స్వీకరణ
సత్యవేడు, జూన్ 1 గరుడధాత్రి : సత్యవేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా డాక్టర్ నరసింహులు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నాయుడుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర అధ్యాపకులుగా విధులు నిర్వహిస్తున్న ఆయన పదోన్నతి పొంది సత్యవేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా నియమితులయ్యారు.ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు, సిబ్బంది డాక్టర్ నరసింహులను సాలువాతో సత్కరించి, పూలమాలలు వేసి ఘనంగా అభినందించారు.అనంతరం ప్రిన్సిపాల్ డాక్టర్ నరసింహులు మాట్లాడుతూ కళాశాల సమగ్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను...