సత్యవేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
సత్యవేడు ఆగస్టు 15 గరుడధాత్రి: దేశభక్తి, జాతీయ స్ఫూర్తి వెల్లివిరిసేలా సత్యవేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నరసింహులు ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ నరసింహులు మాట్లాడుతూ యువత దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని, విద్యార్థులు క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను...