సత్యవేడు మండలంలో అక్రమ మట్టి త్రవ్వకాలు..?

సత్యవేడు జూలై 4 గరుడధాత్రి : తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలో అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పుదుకుప్పం గ్రామంలోని ఆమగుంట చిన్న చెరువు (సర్వే నెం. 80/1)తో పాటు వెంకటరాజుల కండ్రిగలోని సర్వే నెం.12లో ఎలాంటి స్పష్టమైన అనుమతులు లేకుండానే భారీగా మట్టి తవ్వకాలు నిర్వహించి, ట్రాక్టర్ల ద్వారా విక్రయిస్తూ ఒకే రోజులో లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మంగళవారం పుదుకుప్పం గ్రామంలోని ఆమగుంట చిన్న చెరువులో రెండు జేసీబీల సహాయంతో వందకు పైగా ట్రాక్టర్లలో మట్టిని...