సమయస్ఫూర్తితో యువకుడి ప్రాణాలు కాపాడిన నాయుడుపేట పోలీసులు ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదు: జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు
కుటుంబ సమస్యలతో క్షణికావేశానికి లోనైన ఓ యువకుడి ప్రాణాలను నాయుడుపేట పోలీసులు సమయస్ఫూర్తితో కాపాడారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున నాయుడుపేట బైపాస్ రోడ్ సమీపంలో చోటుచేసుకుంది. సుమారు 33 ఏళ్ల వయస్సు గల ఓ వ్యక్తి కుటుంబ కలహాల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై, చేతులను కోసుకుని తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో రోడ్డుపక్కన పడిపోయాడు. సమాచారం అందుకున్న నాయుడుపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హెడ్ కానిస్టేబుల్ రాజు, కానిస్టేబుల్ శ్రీను సమయోచితంగా స్పందించి, బాధితుడిని తక్షణమే...