GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 11:55 am Posted by : GURU SWAMY

సమస్యల నివేదనకు భారీగా తరలివచ్చిన ప్రజలు

* ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు.
* సీఎం సతీమణి నారా భువనేశ్వరి.
కుప్పం,జులై 30(గరుడ ధాత్రి న్యూస్): తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కుప్పం నియోజకవర్గ పరిధిలోని ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరిని ప్రజలు కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అర్జీలను అందజేశారు. కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటన లో భాగంగా శాంతిపురం మండలం శివపురంలోని స్వగృహం కు ఉదయం ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. సమస్యలపై అర్జీలను అందజేశారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి అందరిని నవ్వుతూ ఆప్యాయంగా పలకరిస్తూ అర్జీలను పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చిన్నారిని ఎత్తుకొని ఆశీర్వదించారు. కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మునిరత్నం, టిడిపి నాయకులు సురేష్ బాబు, ఉదయ్ కుమార్ నాయుడు, చంద్రబాబు కార్యదర్శి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.