సమస్యల నివేదనకు భారీగా తరలివచ్చిన ప్రజలు
* ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు. * సీఎం సతీమణి నారా భువనేశ్వరి. కుప్పం,జులై 30(గరుడ ధాత్రి న్యూస్): తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కుప్పం నియోజకవర్గ పరిధిలోని ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరిని ప్రజలు కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అర్జీలను అందజేశారు. కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటన లో భాగంగా శాంతిపురం మండలం శివపురంలోని స్వగృహం కు ఉదయం ప్రజలు...