GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 6:25 am Digital Edition : GURU SWAMY

సమాచార శాఖ ఆధ్వర్యంలో కళాజాత చైతన్య ప్రచార కార్యక్రమాలు.

చిత్తూరు బ్యూరో,అక్టోబర్ 04 (గరుడ ధాత్రి న్యూస్)

:జిల్లాను ఉద్యాన హబ్ గా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో గ్రామస్థాయి నుంచి ప్రజలు, రైతులు యువతకు ఉద్యాన పంటల సాగు పై వివిధ రకాలుగా ప్రజా చైతన్య అవగాహన కార్యక్రమాలను ప్రభుత్వం సమాచార మరియు పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు జిల్లా సమాచార మరియు పౌర సంబంధాల అధికారి ఎన్. వేలాయుధం
పర్యవేక్షణలో నిండ్ర మండలంలోని, పాదిరి పంచాయతీ గ్రామంలో పాదిరి
గ్రామాలలో ప్రచార రథం ద్వారా కళాకారులు కళాజాత చైతన్య ప్రచార కార్యక్రమాలను శనివారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా రవి కళాబృందం ఆధ్వర్యంలో ఉద్యాన పంట సాగు యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం అందించే రాయితీలను ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవాలని అలాగే గ్లోబల్ హార్టికల్చర్ హబ్- రాయలసీమ రైజింగ్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా కళాబృందం వివరించింది.
గ్రామస్థాయిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ తోపాటు వివిధ శాఖల సమన్వయ సహకారాలతో ఆయా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో వ్యవసాయా అనుబంధ రంగాల అధికారులు మరియు సమాచార శాఖ అధికారులు పాల్గొన్నారు.