సమాచార శాఖ ఆధ్వర్యంలో కళాజాత చైతన్య ప్రచార కార్యక్రమాలు.
చిత్తూరు బ్యూరో,అక్టోబర్ 04 (గరుడ ధాత్రి న్యూస్) :జిల్లాను ఉద్యాన హబ్ గా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో గ్రామస్థాయి నుంచి ప్రజలు, రైతులు యువతకు ఉద్యాన పంటల సాగు పై వివిధ రకాలుగా ప్రజా చైతన్య అవగాహన కార్యక్రమాలను ప్రభుత్వం సమాచార మరియు పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు జిల్లా సమాచార మరియు పౌర సంబంధాల అధికారి ఎన్. వేలాయుధం పర్యవేక్షణలో...