సమాచార హక్కు చట్టంపై రెవెన్యూ అధికారులకు అవగాహన అవసరం
బత్తలవల్లం దళితుల సీలింగ్ భూముల ఆక్రమణ వ్యవహారంలో ఆలస్యమైన అప్పీల్ ప్రక్రియపై బాధితుల ఆవేదన రెండో అప్పీల్‌తో రాష్ట్ర సమాచార కమిషన్‌ను ఆశ్రయించిన అర్జీదారులు నిర్లక్ష్యం పై హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరిక సత్యవేడు, ఆగస్టు 04 గరుడధాత్రి : సమాచార హక్కు చట్టం–2005, ఆర్టీఐ యాక్ట్ అమలులో రెవెన్యూ శాఖ అధికారులకు మరింత అవగాహన, బాధ్యతాయుతమైన వ్యవహారశైలి అవసరమనే అభిప్రాయం మరోసారి వ్యక్తమైంది. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం బత్తలవల్లం గ్రామానికి చెందిన దళితుల సీలింగ్ భూముల వ్యవహారంలో సమాచార హక్కు చట్టం 2005...