చిత్తూరు అక్టోబర్ 28 (గరుడదాత్రిన్యూస్)చిత్తూరు నగర పాలక పరిధిలో కూటమి పార్టీల మేయర్ అభ్యర్థి కఠారి హేమలత విజయానికి సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పిలుపునిచ్చారు. నగరపాలక పరిధిలో ఏకగ్రీవంగా ఎన్నికైన కూటమి పార్టీల కార్పొరేటర్ అభ్యర్థులు, పోటీలో ఉన్న అభ్యర్థులతో ఎమ్మెల్యే బుధవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేమాట్లాడుతూపోలింగ్కు తక్కువ సమయం ఉన్నందున క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారం పకడ్బందీగానిర్వహించాలని, పోటీలో ఉన్న కార్పొరేటర్ స్థానాలతో పాటు, మేయర్ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేయాలన్నారు. సమావేశంలో మేయర్ అభ్యర్థి కటారి హేమలత మాజీ ఎమ్మెల్సీ దొరబాబు. చంద్ర ప్రకాష్. కాజూరు బాలాజీ. సురేంద్ర కుమార్. కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.