GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 07 June 2026, 10:56 pm Posted by : GARUDA DHATRI NEWS

సముదాయంలో భక్తిశ్రద్ధలతో మాతమ్మ అమ్మవారికి విశేష పూజలు

నారాయణవనం జూన్ 7 (గరుడ దాత్రి న్యూస్) మండలంలోని సముదాయం గ్రామంలో వెలిసిన శ్రీ మాతమ్మ అమ్మవారి ఆలయంలో ఆదివారం ఉదయం 10 గంటలకు భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పాలు పెరుగు నెయ్యి కొబ్బరినీళ్లు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం పొంగళ్ళు పెట్టి ధూప దీప నైవేద్యం సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి 8 గంటలకు మేళ తాళాల మంగళ వాయిద్యాల నడుమ మాతమ్మ అమ్మవారు గ్రామ పుర వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు అడుగడుగునా టెంకాయ కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.