సమ్మిళిత విద్యతో పిల్లల మధ్య పరస్పర సహకారం

సత్యవేడు, ఆగస్టు 23 గరుడధాత్రి: సమాజంలో ప్రతి చిన్నారికి సమాన అవకాశాలు కల్పించడమే సమ్మిళిత విద్య లక్ష్యమని సత్యవేడు మండల విద్యాశాఖ అధికారి రవి అన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను సాధారణ విద్యార్థులతో కలిపి విద్యనందించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం, స్వీయ గౌరవం, ధైర్యం పెంపొందుతాయని పేర్కొన్నారు. శనివారం సత్యవేడు స్థానిక బాలికల ఉన్నత పాఠశాల ప్రాంగణంలో రెండో విడత జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ జ్యోతి ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమానికి ఎంఈఓ రవి...