GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 9:02 pm Digital Edition : GURU SWAMY

సర్దార్ గౌతు లచ్చన్న జీవితం యువతకు స్ఫూర్తిదాయకం -డీఆర్వో కె. మోహన్ కుమార్

చిత్తూరు, ఆగస్టు 16(గరుడ దాత్రి న్యూస్)

స్వాతంత్ర్య సమరయోధుడు, రైతు ఉద్యమకారుడు,అణగారిన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్తెలిపాడు.ఆదివారం కలెక్టర్కార్యాలయంలోజిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ గౌతు లచ్చన్న 117 వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఆర్వో మాట్లాడుతూ సర్దార్ గౌతు లచ్చన్న తన జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేసిన నిబద్ధతకలిగిననాయకుడని కొనియాడారు.స్వాతంత్ర్యోద్యమ కాలం నుంచే ప్రజా సమస్యలపై పోరాటం ప్రారంభించిన లచ్చన్న అనేక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారని తెలిపారు. మహాత్మా గాంధీ నాయకత్వంలో జరిగిన ఉప్పు సత్యాగ్రహంతో పాటు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలు జీవితం అనుభవించారని గుర్తుచేశారు. జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా, మద్యపాన నిషేధం కోసం, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, పేదలు, బీసీ, బలహీన వర్గాల హక్కుల కోసం ఆయన నిరంతరం పోరాడారని తెలిపాడు.
బీసీ వర్గాల అభ్యున్నతికి లచ్చన్న చేసిన కృషి చిరస్మరణీయమని, సమాజంలోని అణగారిన వర్గాలకు ప్రత్యేక గుర్తింపు, అవకాశాలు కల్పించేందుకు ఆయన చేసిన పోరాటం నేటికీ ఆదర్శప్రాయమని తెలిపారు. అధికారంలో ఉన్న సమయంలోనే కాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడిన నాయకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారని అన్నారు.
లచ్చన్న జీవితాన్ని పరిశీలిస్తే దాదాపు జీవితాంతం ప్రజా పోరాటమే కనిపిస్తుందని, ఆయన చూపిన మార్గం ప్రస్తుత రాజకీయ నాయకులు, యువతకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఎంతకాలం జీవించామన్నది కాకుండా సమాజంపై ఎంతటి సానుకూల ప్రభావం చూపించామన్నదే ముఖ్యమని, ఆ కోణంలో లచ్చన్న జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ .సి కార్పొరేషన్ డైరెక్టర్ యుగంధర్,బీసీ సంక్షేమ శాఖఅధికారి రబ్బానీ భాష,
జిల్లా మత్స్య శాఖాధికారి జి జే ప్రమోద మల్లె నాగరాజు గౌడ్ ,కృష్ణమూర్తి గౌడ్ ,గోపి గౌడ్. ఈశ్వరయ్య ఎక్స్సైజ్ సి.ఐ (రిటైర్డ్),పి రవి ఎం బిసీ బిజెపి నాయకులు అట్లూరి శ్రీనివాసులు నిరదక్షలు గౌడ్ ప్రభావతమ్మ , ప్రసాద్ జనార్ధన్ గౌడ్ ఈడిగ కులస్తులు ప్రజాప్రతినిధులు మరియు బీసీ సంక్షేమ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు