సామాజిక న్యాయం – సమగ్ర సాధికారత దిశగా చారిత్రాత్మక అడుగులు
-విద్య, ఉపాధి, సంక్షేమం, దివ్యాంగుల అభివృద్ధి, గ్రామ-వార్డు పరిపాలనలో విశిష్ట పురోగతి -రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మాత్యులు డా. డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి అమరావతి, జూన్ 10: సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, అట్టడుగు వర్గాల సమగ్ర సాధికారత అనే మహత్తర లక్ష్యాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమ పరిపాలనకు కొత్త దిశను నిర్దేశిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమం, దివ్యాంగులు & వృద్ధుల సంక్షేమం, స్వర్ణ గ్రామం & వార్డు శాఖా...