సాయినగర్ లో ఆర్టీసీ బస్సు స్టాపుల బోర్డుల ప్రారంభం

పలమనేరు, జూన్ 24 ( గరుడ ధాత్రి ) : గంగవరం పంచాయతీ కార్యాలయం వద్ద సాయినగర్ పరిధిలో ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన నూతన ఆర్టీసీ బస్సు స్టాపుల బోర్డులను బుధవారం పలమనేరు ఆర్టీసీ డిపో మేనేజర్ అల్తాఫ్ బాషా ఘనంగా ప్రారంభించారు. ప్రయాణికులకు బస్సుల నిలుపుదలపై స్పష్టమైన అవగాహన కల్పించేందుకు ఈ బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ... పలమనేరు నుండి పుంగనూరు, మదనపల్లి వైపు వెళ్లే అన్ని ఆర్టీసీ బస్సులు ఇకపై గంగవరం పంచాయతీ కార్యాలయం...