పలమనేరు, ఆగస్టు 12 ( గరుడ ధాత్రి ) : స్థానిక బాస్ భవనంలో బుధవారం పలమనేరు సింగల్ విండో అధ్యక్షులుగా ఎన్నికైన హరీష్‌ను బలిజ అభ్యుదయ సేవ సంఘం (బాస్) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి, శాలువాతో సత్కరించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టానున్న ఆయన పదవీకాలం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ‘బాస్’ గౌరవ అధ్యక్షులు సుధాకర్, జనార్దన్, పీజేసీ బాబు, కోటేశ్వర్లు, సుదర్శన్ బాలాజీ, డిష్ రమేష్, జయశంకర్, లక్ష్మీపతి, గణేష్, రమేష్, హేమంత్,నరేష్, రవి, నరసింహులు, పుష్పాల వెంకటేశ్వర్లు, కేశవలు, జనా, చంద్ర, సుబ్బు, గిరి, హరి కుమార్, సుబ్రహ్మణ్యం, జగ్గా, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.