సింగల్ విండో అధ్యక్షుడిగా ఎన్నికైన హరీష్‌కు ఘన సన్మానం
పలమనేరు, ఆగస్టు 12 ( గరుడ ధాత్రి ) : స్థానిక బాస్ భవనంలో బుధవారం పలమనేరు సింగల్ విండో అధ్యక్షులుగా ఎన్నికైన హరీష్‌ను బలిజ అభ్యుదయ సేవ సంఘం (బాస్) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి, శాలువాతో సత్కరించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టానున్న ఆయన పదవీకాలం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 'బాస్' గౌరవ అధ్యక్షులు సుధాకర్, జనార్దన్, పీజేసీ బాబు, కోటేశ్వర్లు, సుదర్శన్ బాలాజీ, డిష్ రమేష్, జయశంకర్, లక్ష్మీపతి,...