నారాయణవనం ఆగస్టు 11( గరుడ దాత్రి న్యూస్)నారాయణవనం మండలం, నాగిలేరు పంచాయతీలోని సింగిరి కోనలో వెలిసిన
శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని మంగళవారం మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఆలయ పరిసరాలు, నిత్యం ప్రవహించే జలపాతం, స్వామి అమ్మవార్ల విగ్రహాలు చాలా అద్భుతంగా ఉందని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. ఆలయ విశిష్టత, ఇక్కడ జరిగే పూజలు, నిత్య అన్నదాన కార్యక్రమాలు వంటి విషయాలను కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన సతీమణి స్వర్ణలతమ్మ కుటుంబ సభ్యులను ఆలయ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు భాస్కర్ బాబు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేసి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.