సింగిరి కోన శ్రీలక్ష్మినరసింహస్వామి వారినిదర్శించుకున్న మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
నారాయణవనం ఆగస్టు 11( గరుడ దాత్రి న్యూస్)నారాయణవనం మండలం, నాగిలేరు పంచాయతీలోని సింగిరి కోనలో వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని మంగళవారం మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఆలయ పరిసరాలు, నిత్యం ప్రవహించే జలపాతం, స్వామి అమ్మవార్ల విగ్రహాలు చాలా అద్భుతంగా ఉందని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. ఆలయ విశిష్టత, ఇక్కడ జరిగే పూజలు, నిత్య అన్నదాన కార్యక్రమాలు వంటి విషయాలను కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు....