సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ప్రజాసంఘాలలో చేరిన మాజీ సిపిఎం నేతలు

సత్యవేడు నియోజకవర్గంలోని సత్యవేడు, నాగలాపురం, పిచ్చాటూరు మండలాలకు చెందిన మాజీ సిపిఎం నేతలు శుక్రవారం సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ అనుబంధ ప్రజాసంఘాలైన ఏఐకేఎంఎస్, ఐఎఫ్టియులో చేరారు. తిరుపతి జిల్లా నారాయణపురంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు పి. వెంకటరత్నం వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షుడు, సిపిఎం సీనియర్ నాయకుడు అరుణాచలం, నాగలాపురం మండల మాజీ కార్యదర్శి మురుగేషన్‌తో పాటు దినమణి, పద్మ, దక్షిణామూర్తి,...