GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 14 September 2026, 7:42 pm Digital Edition : GURU SWAMY

సీఎం చంద్రబాబుకు బండారు దత్తాత్రేయ ప్రత్యేక ఆహ్వానం

కుప్పం,సెప్టెంబర్ 14 (గరుడ ధాత్రి న్యూస్)

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలిసి, అక్టోబర్ 22న నిర్వహించనున్న తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ప్రతీక ‘అలయ్-బలయ్-2026’ వేడుకలకు ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించారు. దత్తాత్రేయ ఆహ్వానాన్ని సాదరంగా స్వీకరించిన సీఎం చంద్రబాబు, ప్రజల మధ్య సామాజిక సామరస్యానికి వేదికగా నిలిచే ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతానని స్పష్టం చేశారు.