GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 11 June 2026, 7:03 am Posted by : GARUDA DHATRI NEWS

సీఎం పర్యటన కు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు

రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్న సభకు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ సమగ్ర భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసింది.

– వివిఐపీలు, విఐపీలు మరియు సాధారణ ప్రజల కోసం ప్రత్యేక ఎన్‌క్లోజర్లు, ఎంట్రీ మార్గాలు, పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

– సభకు సుమారు 10 వేల మంది వరకు హాజరయ్యే అవకాశం ఉండటంతో ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించారు.

– తిరుపతి నగరంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రత్యేక ట్రాఫిక్ నిర్వహణ చర్యలు చేపట్టారు.

– భద్రత, ట్రాఫిక్ పర్యవేక్షణ కోసం దాదాపు 800 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

– డ్రోన్స్ మరియు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా కూడా నిరంతరం మానిటరింగ్.

– జిల్లా ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బరాయుడు ఐపిఎస్, గారు.

తిరుపతి, జూన్ 08 : రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, కేంద్ర మంత్రులు, రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు మరియు ఎమ్మెల్యేలు హాజరుకానున్న భారీ బహిరంగ సభకు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ అన్ని రకాల భద్రతా, ట్రాఫిక్ ఏర్పాట్లను పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారు తెలిపారు.
సభకు విచ్చేసే వివిఐపీలు, విఐపీలు మరియు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఎన్‌క్లోజర్లు, ప్రత్యేక ప్రవేశ ద్వారాలు, పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. సుమారు 10 వేల మంది వరకు ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి కూడా ప్రత్యేక పార్కింగ్, సులభ ప్రవేశ ఏర్పాట్లు కల్పించినట్లు పేర్కొన్నారు.
సభను తిరుపతి నగర పరిధి వెలుపల నిర్వహించడం వల్ల నగర ప్రజలు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం ఉండదని ఎస్పీ స్పష్టం చేశారు. నగరంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రత్యేక ట్రాఫిక్ నిర్వహణ చర్యలు చేపట్టామని తెలిపారు.
సభ నిర్వహణ, భద్రతా పర్యవేక్షణ కోసం దాదాపు 800 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ గారు తెలిపారు.
అనంతరం బందోబస్తు పోలీస్ అధికారులతో సమావేశం ఏర్పాటుచేసి బందోబస్తు, భద్రతపై సమీక్షించారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు శ్రీ వెంకటరావు (పరిపాలన) శ్రీ రవి మనోహర్ ఆచారి (శాంతిభద్రతలు) శ్రీ రామకృష్ణ (తిరుమల) శ్రీ శ్రీనివాసులు (క్రైమ్స్) శ్రీ కులశేఖర్ (రెడ్ శాండిల్) శ్రీమతి శ్రీలత (మహిళా పోలీస్ స్టేషన్ )మరియు డీఎస్పీలు సిఐలు పాల్గొన్నారు.
ప్రజలు పోలీసు శాఖకు సహకరించి తోడ్పడాలని జిల్లా ఎస్పీ గారు కోరారు.