GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 06 May 2026, 9:47 pm Digital Edition : GURU SWAMY

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును లబ్దిదారునికి అందించిన జనసేన నాయకులు

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును లబ్దిదారునికి అందించిన జనసేన నాయకులు

పూతలపట్టు నియోజకవర్గం తవణం పల్లె మండలం గోవిందరెడ్డి పల్లికి చెందిన బుజ్జికి ముఖ్యమంత్రి సహాయనిది 92వేల చెక్కును బుధవారం జనసేన నాయకులు లబ్ధిదారునికి అందించారు. జనసేన నాయకులకు అర్థగిరి ఆంజనేయస్వామి ఆలయంలో 12వ తేదీ జరిగే హనుమాన్ జయంతి వేడుకలకు రావాలని జనసేన నాయకులకు అర్థగిరి ట్రస్ట్ బోర్డు సభ్యులు రాధిక ఆహ్వానం అందించారుఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,ప్రభుత్వం అందించిన ఈ సహాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలోజనసేన పార్టీ నాయకులు రఘురాం చౌదరి, ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి ఏ.పీ. శివయ్య, మాజీ కాణిపాకం బోర్డు సభ్యుడు పూల ప్రభాకర్, మాజీ కాణిపాకం చైర్మన్ లత రాజ్ కుమార్, ఐరాల మండల అధ్యక్షుడు పురుషోత్తం, మహేష్ స్వేరో, కిషోర్, రెడ్డప్ప, యాదమరి మండల జనసేన అధ్యక్షుడు కుమార్, తవణంపల్లి మండల జనసేన జనరల్ సెక్రటరీ ఉదయ్ కుమార్, మాజీ అర్ధగిరి ఆంజనేయ స్వామి ఆలయ చైర్మన్ జెట్టిపల్లి శీను, అర్ధగిరి ఆంజనేయ స్వామి ట్రస్ట్ బోర్డ్ సభ్యురాలు శ్రీమతి బి. రాధికా, జనసేన పార్టీ సీనియర్ నాయకులు చిన్న, యోగరాజు, కుమార్ స్వామి, శరత్ బాబు, పృథ్వీ రాజేష్, అనిల్ మురళి, యువరాజ్, వేణు, రెడ్డి ప్రసాద్ మరియు బంగారుపాళ్యం మండలం నుంచి శాంతమూర్తి, అనిల్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.