GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 14 September 2026, 3:45 am Digital Edition : GURU SWAMY

సీఎం రిలీఫ్ ఫండ్ పేదల పాలిట అభయ హస్తంలా నిలుస్తోంది -చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు

చిత్తూరు సెప్టెంబర్ 13 గరుడదాత్రిన్యూస్ :

ముఖ్యమంత్రి సహాయనిధి,.. పేదల పాలిట ఆపన్న హస్తంలాతోడ్పాటునందిస్తోందని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు, చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలిపాడు.సీఎం రిలీఫ్ ఫండ్ సమాజంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యవసర సమయాల్లో ఆసరాగా నిలుస్తోందని ఆయనతెలిపారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధి (AP CMRF) ద్వారా నిరుపేదలకు, ఆప్తులకు ఆర్థిక సాయాన్ని అందిస్తూ ప్రజా సేవలో చురుగ్గా పాల్గొంటున్న చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ.., అదే పందాలో తాను సిఫారసు చేసి,.. ముఖ్యమంత్రి సహాయ నిధి ధ్వారా మంజూరైన 9,37,553 రూపాయల విలువచేసే చెక్కులను,19 మంది లబ్ధిదారులకు ఆదివారం చిత్తూరులోని ఎంపీ కార్యాలయంలో, బాధితులకు పరోక్షంగా సహాయ సహకారాలు అందించిన కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు విషయంలో తీసుకున్న చొరవనుఅభినందనీయమని ఈ సందర్భంగా చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు కొనియాడారు. ముఖ్యమంత్రి స్ఫూర్తితో తాను పేదలకు అండగా నిలుస్తుంది అన్నారు.