GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 29 May 2026, 10:03 pm Posted by : GARUDA DHATRI NEWS

సీసీ నాగేంద్ర రావు కు ఘన సన్మానం

నారాయణవనం, మే 29, గరుడ దాత్రి :

మహిళా సంఘాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసి పదవీ విరమణ పొందుతున్న సీసీ నాగేంద్రరావుకు నారాయణవనం మండల మహిళా సమైక్య కార్యాలయంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సెర్ఫ్ సహాయ ప్రాజెక్టు అధికారి ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ మహిళా సంఘాల బలోపేతానికి నాగేంద్రరావు అందించిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. మహిళా సంఘ సభ్యులకు విశేష సేవలు అందించినందుకు ఆయనను ఘనంగా సన్మానించి అభినందించారు.
సన్మానానికి స్పందించిన నాగేంద్రరావు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల ద్వారా పేదలకు సేవ చేసే అవకాశం లభించడం తన అదృష్టమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సహకరించిన అధికారులకు, మహిళా సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏపీఎం టి. ధనంజయ రెడ్డి, సీసీలు నిమ్మి, అరుణ్ కుమార్, రాజేశ్వరి, అకౌంటెంట్ మల్లిక, ఎంఎస్ అధ్యక్షురాలు పి. రామతులసి, కార్యదర్శి శాంతి, కోశాధికారి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.